Saturday, April 20, 2024

లాల్ సింగ్ చ‌డ్డా స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను రూ.160 కోట్ల‌కి ద‌క్కించుకున్న నెట్ ప్లిక్స్

లాల్ సింగ్ చ‌డ్డా చిత్రాన్ని ఓటీటీ సంస్థ నెట్ ప్లిక్స్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను ద‌క్కించుకుంది. బాలీవుడ్ వర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ అన్ని భాష‌ల‌కు క‌లుపుకుని దాదాపు రూ.160కోట్ల‌కు ద‌క్కించుకుంద‌ట‌. అంతేకాకుండా ఈ చిత్రం థియేట‌ర్ రిలీజ్‌కు 6నెల‌ల త‌ర్వాత డిజిట‌ల్ స్ట్రీమింగ్ కానుందట‌. ఇందులో నిజమెంతుందో తెలియదు గాని ఇంత మొత్తంలో నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఓటీటీ హ‌క్క‌ల‌ను కొనుగోలు చేసిందంటే విశేషం అనే చెప్పాలి. ఈ లెక్క‌న చూసుకుంటే కేవ‌లం ఓటీటీ రైట్స్‌తోనే ఈ సినిమా టోట‌ల్‌ బ‌డ్జెట్ రిక‌వ‌రీ అయిన‌ట్టే.

ఈ చిత్రాన్ని హాలీవుడ్ ‘ఫారెస్ట్ గంప్’ సినిమాను బేస్ చేసుకుని తెర‌కెక్కించారు. హీరోగా బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ న‌టిస్తుండ‌గా ఆయ‌న‌కి జోడీగా క‌రీనా క‌పూర్ న‌టించింది. వయాక‌మ్18 స్టూడీయోస్‌తో క‌లిసి అమీర్‌ఖాన్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. గ‌తంలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప‌లు కార‌ణాల వ‌ల్ల విడుద‌ల తేదీ వాయిదా పడుతూ వ‌చ్చింది. కాగా ఈ చిత్రం ఆగ‌స్టు 11న హిందీతో పాటు తెలుగులోనూ ఏక‌కాలంలో విడుద‌ల కానుంది. అద్వైత్ చంద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. ఇప్ప‌టికే చిత్రం నుండి విడులైన ప్రచార చిత్రాలు, ట్రైల‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశాయి. తెలుగులో ఈ చిత్రానికి చిరంజీవి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement