Saturday, April 20, 2024

నేహా కక్కర్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ 6 కోట్లు

బాలీవుడ్ గాయని నేహా ఇన్ స్టాగ్రామ్ లో 60 మిలియన్ మార్క్ దాటింది. నేహా కక్కర్ ప్రస్తుతం బాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్స్ లో నంబర్ వన్ గా కొనసాగుతోంది. అలాగే, వీడియో ఆల్బమ్స్ తోనూ అలరిస్తోంది. ఇండియన్ ఐడల్ రియాల్టీ షో జడ్జ్ కూడా నేహా ప్రేక్షకుల మనసులు దోచుకుంది… హైట్ విషయంలో దాదాపుగా అందరు సింగర్స్ కంటే పొట్టి అయిన అందాల గాయనీ… అభిమానుల ఫాలోయింగ్ విషయంలో మాత్రం అందనంత ఎత్తులో కొనసాగుతోంది! నేహా కక్కర్ తాజాగా ఇన్ స్టాగ్రామ్ ఫాలోయర్స్ విషయంలో ఇతర భారతీయ సంగీత ప్రముఖులందర్నీ దాటేసింది! 60 మిలియన్… అంటే 6 కోట్ల మందితో… అత్యధిక ఫాలోయర్స్ గల ఇండియన్ మ్యూజీషియన్ గా రికార్డ్ సృష్టించింది…ఇక తన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ రోషిణీ, శ్రేయాను తన ‘థాంక్యూ’ మెసేజ్ లో ట్యాగ్ చేసింది నేహా కక్కర్.

ఇది కూడా చదవండి: శంకర్ చెర్రీ సినిమాకు కూడా బుర్రా సాయి మాధవ్ నే!!

Advertisement

తాజా వార్తలు

Advertisement