Wednesday, April 24, 2024

కొత్త బిజినెస్ లో అగుడుపెట్టిన నయన్ విగ్నేష్

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. కెరీర్ ను ప్రారంభించి చాలా ఏళ్లు అవుతున్నా… అదే స్టార్ డమ్ ను కొనసాగిస్తోంది నయనతార. నయనతార ప్రస్తుతం డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్నారు. అయితే ఈ ఇద్దరు పెళ్లి గురించి గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. అలాగే వీరి పెళ్లి కోసం అభిమానులే కాకుండా సినీ ఇండస్ట్రీలో స్టార్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే తాజాగా ఈ ఇద్దరు చెన్నైకి చెందిన పానీయాల బ్రాండ్ చాయ్ వాలే లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తం దేశవ్యాప్తంగా 35 స్టోర్లు తెరవాలని ఆ బ్రాండ్ వారు టార్గెట్ పెట్టుకోగా పలువురు సినీ ప్రముఖులను సహాయం కోరారట. కాగా ఈ బిజినెస్ లోకి నయనతార విగ్నేష్ శివన్ కూడా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement