Wednesday, March 27, 2024

పవన్ పై నవీన్ పొలిశెట్టి ఎమోషనల్ ట్వీట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తొందరగా కోలుకొని రావాలంటూ అభిమానులు సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని రావాలంటూ ట్వీట్ చేయగా తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి పవన్ కోలుకొని రావాలంటూ పోస్ట్ పెట్టాడు.

వకీల్ సాబ్ లో అల్వాల్ సీన్ కోసం ప్రస్తావిస్తూ అక్కడ పవన్ డైలాగ్ మాడ్యులేషన్అద్భుతమని…చెబుతూనే తర్వాత తన లాయర్ చిట్టి కోసం ప్రస్తావిస్తూ ఓ పంచ్ డైలాగ్ వేశాడు. అలాగే పవన్ సినిమా ఖుషి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ తీసుకున్న నాటి నుంచి తన ప్రేమ ఉందని…ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు నవీన్ పోలిశెట్టి ట్విట్టర్లో పేర్కొన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement