Thursday, April 25, 2024

అక్టోబర్ 22న రానున్న ‘నాట్యం’

కూచిపూడి డాన్సర్ సంధ్యా రాజు న‌టిస్తోన్న‌ తొలి సినిమా నాట్యం. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో కమల్ కామరాజు, రోహిత్ బెహల్ కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్, టీజ‌ర్‌కు ట్రెమండ‌స్‌ రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే ఇటీవ‌ల న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ ఆవిష్క‌రించిన ఈ సినిమాలో తొలి సాంగ్ `నమః శివాయ‌`కు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి విశేష స్పంద‌న ల‌భించింది. తాజాగా ఈ సినిమాను అక్టోబ‌ర్ 22, న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. ఈ సంద‌ర్భంగా విడుద‌ల‌చేసిన పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది.

ఈ సినిమాలో కమల్ కామరాజ్, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, భానుప్రియ, సుభలేఖ సుధాకర్, రుక్మిణీ విజయకుమార్, బేబీ దీవెన ముఖ్య పాత్రలు పోషించారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి కరుణాకర్ అడిగర్ల సాహిత్యం అందించారు. నిశ్రింకళ ఫిలింస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement