Friday, March 29, 2024

‘టక్ జగదీష్’ నుంచి కొత్త పాట విడుదల

నేచురల్ స్టార్ నాని టక్ జగదీష్ మూవీ నుంచి ‘నీటి నీటి సుక్క’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం ఆదివారం నాడు రిలీజ్ చేసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రీతూవర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న ఎస్.ఎస్. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ‘నీటి నీటి సుక్క’ అంటూ సాగే పాటకు కల్యాణ్ చక్రవర్తి రాసిన అర్థవంతమైన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. మోహన భోగరాజు మెస్మరైజింగ్ వాయిస్ గీతానికి ప్రధాన ఎస్సెట్. కాగా ఈ చిత్రం ఏప్రిల్ 23న రిలీజ్ కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement