Thursday, March 28, 2024

నాని అడుగు ముందుకు పడింది ?

హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం జగదీశ్, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు. తన నటనతో మినిమమ్ గ్యారెంటీ హీరోగా నాని పేరు తెచ్చుకున్నాడు. అందుకే నిర్మాతలు కూడా నానితో సినిమాలు చేయడానికి వెనక్కి తగ్గరు.

ఇక ఆఖరుగా వచ్చిన వి సినిమా ఓ టి టి లో రిలీజ్ అయింది. కానీ అక్కడ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఏప్రిల్ 26న టక్ జగదీష్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. దీంతోపాటు శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా సెట్స్ పై ఉంది. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమా నాని కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కే బోతున్నట్లు సమాచారం. అదే కనుక నిజమైతే నాని మార్కెట్ పెరిగినట్టే.

Advertisement

తాజా వార్తలు

Advertisement