Saturday, April 20, 2024

మేజర్ టీజర్ పై న్యాచురల్ స్టార్ ప్రశంసలు

క్షణం, గూడచారి ,ఎవరు వంటి చిత్రాలతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు యంగ్ హీరో అడవి శేషు. ప్రస్తుతం ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలకు తెగించి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మేజర్ సినిమాలో నటిస్తున్నాడు అడివి శేషు. కాగా ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తుండగా ఇప్పటికే విడుదలైన లుక్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచాయి.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను సోమవారం సాయంత్రం హిందిలో సల్మాన్ ఖాన్, తెలుగులో మహేష్ బాబు ,మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ చేతుల మీదగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే టీజర్‌పై న్యాచురల్ స్టార్ నాని ప్రశంసల వర్షం కురిపించాడు. నేను మేజర్ సినిమా టీజర్ చూశాను. ఈ మధ్యకాలంలో నేను చూసిన టీజర్లన్నింటిలోనూ ఇది బెస్ట్ అంటూ నాని ట్వీట్ చేశాడు. దీనిపై అడివి శేష్ స్పందిస్తూ లవ్ యూ బ్రదర్ అంటూ రిప్లయ్ ఇచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement