Friday, April 19, 2024

నారప్ప ఎక్కడికో వెళ్తున్నాడు..

ఉగాది పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని నారప్ప నుంచి ఒక స్పెషల్ పోస్టర్ ను వదిలింది చిత్ర బృందం. నారప్ప తన భార్యాబిడ్డలతో కలిసి ఎక్కడికో బయల్దేరినట్టుగా ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. తెల్లరంగు లుంగీ .. చొక్కా .. కండువాతో వెంకటేశ్ మెరిసిపోతున్నాడు. ఓ సాధారణమైన పల్లెటూరి ఇల్లాలిగా ప్రియమణి ఆకట్టుకుంటోంది. గ్రామీణ నేపథ్యంతో కూడిన ఈ పోస్టర్ .. ‘ఉగాది’ ఉత్సాహాన్ని తెస్తోంది. తమిళంలో ధనుశ్ చేసిన ‘అసురన్’కి ఇది రీమేక్. తమిళంలో ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకోవడమే కాకుండా, విమర్శకుల నుంచి సైతం ప్రశంసలను అందుకుంది. వైవిధ్యభరితమైన ఆ సినిమాను ‘నారప్ప’ టైటిల్ తో రూపొందించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, వెంకటేశ్ సరసన ప్రియమణి నటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement