Wednesday, April 24, 2024

అమెజాన్ ప్రైమ్‌లో ‘నారప్ప’… అధికారిక ప్రకటన వచ్చేసింది

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నారప్ప. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా రిలీజ్ పై రకరకాల వార్తలు తెరపైకి రాగా… ఆఖరికి క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాను అనుకున్న విధంగానే అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నారు. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేశారు.

జూలై 20న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ అక్టోబర్ లాస్ట్ వరకు ఓటీటీ లో విడుదల చేయొద్దని చెప్పినా నారప్ప ను ఓటీటీ లో సురేష్ బాబు రిలీజ్ చేయడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement