Friday, March 29, 2024

న‌ర‌కాసుర‌.. ఐదు భాష‌ల్లో ఫ‌స్ట్ గ్లింప్స్ రిలీజ్

న‌ర‌కాసుర‌.. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి సెబాస్టియన్ దర్శకత్వం వహించాడు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.ఈ భాషలన్నిటిలోను ఫస్టు గ్లింప్స్ ను విడుదల చేశారు. శివుడి నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలకి సంబంధించిన షాట్స్ ను ఆవిష్కరిస్తూ, ఆర్ఆర్ పై కట్ చేసిన విజువల్స్ ఆసక్తిని రేకెత్తించేవిగా ఉన్నాయి. కంటెంట్ విషయంలో ఏ అంశాన్ని రివీల్ చేయకుండా ఉత్కంఠను రేకెత్తించే ప్రయత్నం చేశారు. శ్రీనివాస్ నిర్మించారు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాతో తెలుగు తెరకి అపర్ణ జనార్దన్ పరిచయం కానుంది. గ్లామరస్ గా కనిపిస్తున్న అపర్ణకి ఈ సినిమా తరువత ఇక్కడ వరుస అవకాశాలు రావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.ఈ సినిమాలో నాజర్ … చరణ్ రాజ్ .. సంకీర్తన ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement