Sunday, May 28, 2023

దసరతో మూవీతో భారీగా పెరిగిన నాని రెమ్యునరేషన్‌..

టాలీవుడ్ ప్రముఖ నటుల్లో ఘంటా నవీన్ బాబు అకా న్యాచురల్ స్టార్ నాని ఒకరు. ‘నేను లోకల్‌’ సినిమాతో నానికి ఫేమ్‌తో పాటు ఫాలోవర్స్ రెండింతలు పెరిగారు. అయితే, గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాకి యావత్ ఇండియా పాపులారిటీ రావడంతో నాని తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసినట్లు సినీ వర్గాల సమాచారం.

- Advertisement -
   

మరో రెండు రోజుల్లో (మార్చి 30) రిలీజ్ కానున్న దసర సినిమాలో కనిపించనున్నాడు. కాగా, ఈ మూవీకి నాని సుమారు 15 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. తాజా బజ్ ప్రకారం, నాని ఇప్పుడు తన రెమ్యునరేషన్‌ను పెంచినట్టు తెలుస్తోంది. ఇక తన తదుపరి ప్రాజెక్ట్ కు దాదాపు రూ.22 కోట్లకు పైగా వసూలు చేయనున్నాడని టాలీవుడ్ టాక్.

Advertisement

తాజా వార్తలు

Advertisement