Saturday, April 20, 2024

ప్రైమ్ లో నాని ‘టక్ జగదీష్’

శివ నిర్వాణ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం టక్ జగదీష్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో లో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో నాని శివ నిర్వాణ కాంబినేషన్ లో నిన్ను కోరి చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో టక్ జగదీష్ సినిమాపై అంచనాలు ఎక్కువయ్యాయి.

ఇక ఈ సినిమాకు సంగీతం థమన్ అందించగా… ఇప్పటికే విడుదలైన సాంగ్స్ , లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఏప్రిల్ 23న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. కాగా తాజా సమాచారం ప్రకారం… ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిందని త్వరలోనే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటిస్తామని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement