Friday, March 29, 2024

సినిమా అంటే చిన్న చూపా? హీరో నాని ఆవేదన

తిమ్మరుసు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాచురల్ స్టార్ నాని వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. నాని మాట్లాడుతూ… సినిమా అనేది ఒక కల్చర్. థియేటర్‌కు వెళ్లి సినిమా చూడటం అనేది మన బ్లడ్ లోనే ఉంది. అయితే మరోవైపు నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ ఈ సినిమాపై మాత్రం ఆంక్షలు పెడుతున్నారు…ఎందుకు? అంటూ నాని విమర్శించాడు.

సినిమా అంటే చాలామంది చిన్నచూపు చూస్తున్నారని రెస్టారెంట్లు, పబ్లు ఇతర ప్రదేశాల కన్నా థియేటర్ చాలా సేఫ్ అని కానీ వాటిని ముందు మూస్తారు… లాస్ట్‌లో తెరుస్తారని చెప్పుకొచ్చారు నాని. నేను ఒక ప్రేక్షకుడిగా చెప్తున్నాను మనం మన ఇంట్లో గడిపే సమయం మినహా మిగిలిన సమయంలో ఎక్కువ సమయం థియేటర్లోనే ఉంటామని మనదేశంలో సినిమాను మించిన ఎంటర్‌టైన్‌మెంట్ ఏదీ లేదన్నారు.

థియేటర్ వ్యవస్థ మీద కొన్ని లక్షల మంది బతుకుతున్నారని… వాళ్లంతా ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇలానే ఉంటే థియేటర్ వ్యవస్థ నాశనం అవుతుందని అందరూ కలిసి ఈ సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పుకొచ్చారు నాని.

Advertisement

తాజా వార్తలు

Advertisement