Tuesday, March 26, 2024

తెలంగాణ యాస నేర్చుకుంటున్న నాని

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టక్ జగదీష్ సినిమా ప్రస్తుతం రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అలాగే రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ సినిమా చేస్తున్నాడు. మరో వైపు అంటే సుందరానికి సినిమా కూడా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు శ్రీకాంత్ అనే దర్శకుడు కొత్తగా పరిచయం అవుతున్నాడు. తెలంగాణ నేపథ్యంలో ఈ కథ ఉండబోతున్న ట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే నాని తెలంగాణ అబ్బాయి గా కనిపించబోతున్నాడట. అలాగే తెలంగాణ యాస మీద పట్టు సాధించాలని ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో కృష్ణార్జున యుద్ధం సినిమా సమయంలో రాయలసీమ యాస నేర్చుకున్నాడు నాని. ఇప్పుడు తెలంగాణ యాసలో ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement