Thursday, March 28, 2024

జెర్సీ కాంబినేషన్ రిపీట్ ? ఈ సారి జవాన్ బయోపిక్

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరో గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం జెర్సీ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించడంతో పాటు నటుడిగా నానికి మంచి పేరును తీసుకువచ్చింది. ఇకపోతే ప్రస్తుతం గౌతమ్ జెర్సీ సినిమా హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో హీరోగా షాహిద్ కపూర్ నటిస్తున్నాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మరో ఎమోషనల్ స్టోరీ ని నాని చేయబోతున్నాడట. కాళ్లు లేని ఓ జవాన్ లైఫ్ స్టోరీ ఈసారి చూపించబోతున్నాడట. ఇప్పటికే నాని కి కథ కూడా చెప్పాడట గౌతమ్. ఈ ఏడాది నవంబర్ లో ఈ సినిమా స్టార్ట్ చేయబోతున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement