Monday, March 25, 2024

ఒకే సారి రెండు సినిమాలు ? కరోనాని కేర్ చెయ్యని నాని !!

నాచురల్ స్టార్ నాని హిట్లు, ఫ్లాప్ లతో తో సంబంధం లేకుండా వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. టక్ జగదీష్ సినిమా తో పాటు మరికొన్ని సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇందులో శ్యామ్ సింగరాయ్ ఒకటి కాగా వేరొకటి అంటే సుందరానికి. భారీ బడ్జెట్ తో రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో శ్యామ్ సింగ రాయ్ తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఓ భారీ సెట్ ని కూడా దర్శక నిర్మాతలు ఏర్పాటు చేశారు.

మరోవైపు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి సినిమా చేస్తున్నాడు. ఈ రెండు కూడా కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తగు నిబంధనలు పాటిస్తూ రెండు చిత్రాలను కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నాడు. ఇక అంటే సుందరానికి సినిమాలో నజ్రియా హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో నజ్రియా తెలుగు ఇండస్ట్రీకి డైరెక్ట్ గా పరిచయం కాబోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement