Saturday, April 20, 2024

ఉగాది రోజున నాగ శౌర్య #NS23 మూవీ టైటిల్ అప్‌డేట్

యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ నాగ శౌర్య కొత్త సినిమా “ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి”. ఈ మూవీ గత శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అయింది. శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా లో మాళవిక నాయర్ హీరోయిన్ గా కనిపించింది. ఇక తాజాగా నాగా శైర్య నెక్స్ట్ మూవీ #NS 23పై సినీ సర్కిల్ లో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. నూతన దర్శకుడు పవన్ బసంశెట్టి డైరెక్షన్ లో గత ఏడాది ఆగష్టులో ప్రారంభమైంది.

కాగా, మేకర్స్ ఇప్పుడు ఈ మూవీ టైటిల్‌ను ఈ నెల మార్చి 22న వచ్చే పవిత్రమైన ఉగాది రోజున ప్రకటిస్తారని ఒక ఆసక్తికరమైన అప్‌డేట్‌తో ముందుకు వచ్చారు. అందుకోస్ మోనోక్రోమిక్ ప్రీ-లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యుక్తి తరేజా కథానాయికగా కనిపించనుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి నిర్మాణంలో పవన్ సిహెచ్ సౌండ్‌ట్రాక్‌లను అందించనున్నారు. మూవీకి సంభందించిన మరిన్ని వివరాలు ఉగాది రోజున వెలవడనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement