Wednesday, April 24, 2024

దర్శక నిర్మాతలకు నాగ్ ఫుల్ సపోర్ట్!!

ఇటీవల వైల్డ్ డాగ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కింగ్ అక్కినేని నాగార్జున. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాను చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇక పరిస్థితులు అన్నీ చక్కబడితే జూన్ మొదటి వారం నుండి మళ్లీ ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక ప్రత్యేకమైన సెట్ ని కూడా రెడీ చేస్తున్నారట.

ఎలాంటి కుదింపులు లేకుండా అవసరమైనంత మంది తో ఈ షూటింగ్ ను చెయ్యాలని దర్శకనిర్మాతలు బావిస్తుంటే అందుకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడట నాగార్జున. ఇక ఈ సినిమాలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా నటిస్తున్నారు. ఓ రా ఏజెంట్ గా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కనిపించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement