Thursday, April 25, 2024

ర‌ష్మికకు నాగార్జున ఛాలెంజ్..

వైల్డ్ డాగ్ మూవీ ప్ర‌మోష‌న్స్ కోసం నాగ్ ఓ వినూత్న పద్దతిని ఎంచుకున్నారు. 30 సెక‌న్ల‌లో సింగిల్ పుష్ అప్ చేసి సెలబ్రిటీలకు ఛాలెంజ్ విసురుతున్నారు నాగార్జున. మొదటి ఈ చాలెంజ్ ను నాగార్జున రష్మికను నామినెట్ చేశాడు..దీనిపై స్పందించిన రష్మిక సార్..చూడండి ఇప్ప‌టికీ చాలా క‌ష్ట‌ప‌డుతున్నా అంటూ వీడియో పెట్టింది. రష్మిక కొన్నిసెకన్ల పాటు పుషప్ పొజిషన్ లో ఉండి ఆ వీడియోను ట్విట్టర్ లో పంచుకున్నారు. అయితే ఆ వీడియో పట్ల స్పందించిన నాగ్… పుషప్స్ తీయడం అంటే ఇలా అంటూ రష్మిక కంటే మరికాస్త ఎక్కువ సమయం పుషప్ పొజిషన్ లో నిలిచి సవాల్ విసిరారు. తన టైమింగ్ ను అధిగమించాలని రష్మికకు సవాల్ విసిరారు. దీనికి సార్… మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో… ఏదో ఒకరోజు మిమ్మల్ని నా బాడీగార్డ్ గా అపాయింట్ చేసుకుంటా! అంటూ చమత్కరించింది. అంతేకాదు, నాగ్ పుషప్ టైమింగ్ చూసి…. సార్, నేను మీలా చేయాలంటే ఓ సంవత్సరం పడుతుందేమో! అని వ్యాఖ్యానించారు. .మ‌రి ర‌ష్మిక నాగార్జున ఛాలెంజ్‌ను స్వీక‌రించి..ఆ రికార్డును బ్రేక్ చేస్తుందో..? లేదో చూడాలి. వైల్డ్‌డాగ్ ఏప్రిల్ 2న విడుద‌ల కాబోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement