Thursday, April 18, 2024

లవ్ స్టోరీ కు ముహూర్తం ఫిక్స్ ?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం లవ్ స్టోరీ. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం కు సంబంధించిన పాటలు, లుక్స్ ఇప్పటికీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 16న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. కాగా లవ్ స్టోరీ సినిమా ఓటీటీ లో రిలీజ్ కాబోతోందని సోషల్ మీడియా లో అప్పుడు ప్రచారం జరిగింది. అయితే వెంటనే చిత్ర యూనిట్ స్పందిస్తూ….ఈ సినిమాను థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.

అయితే ఇప్పుడు థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాయి. చాలా సినిమాలు రిలీజ్ కు ముహూర్తాలు ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే లవ్ స్టోరీ సినిమా కూడా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 10న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే అందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement