Friday, April 19, 2024

ఇదేందయ్యా ఇది!! రోజా కమెడియన్ లా కనిపించిందా

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకీయంగా, సినిమాల పరంగా, వ్యక్తిగతంగా ఇలా ఏ విషయం అయినా సోషల్ మీడియా ద్వారానే నాగబాబు స్పందిస్తూ ఉంటారు. అయితే తాజాగా నాగబాబు నెటిజన్స్ తో కాసేపు ముచ్చటించారు. వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

కాగా ఓ నెటిజన్ జబర్దస్త్ లో మీకు ఇష్టమైన కమెడియన్ ఎవరని అడిగాడు దానికి నాగ బాబు సమాధానం ఇస్తూ రోజా అని చెప్పాడు. నిజానికి జబర్దస్త్‌లో రోజా జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. కానీ నాగబాబు కావాలనే రోజా పై పంచ్ డైలాగ్ వేశారు. అది చూసిన మిగతా నెటిజన్లు నాగబాబు ఎందుకు అలా అన్నాడా అని తలలు పట్టుకుని ఆలోచిస్తున్నారు. మరి నాగబాబు ఏ ఉద్దేశంతో అన్నాడో ఆయనకే తెలియాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement