Thursday, April 25, 2024

వర్మని కెలికిన నాగబాబు – వర్మ ఊరుకుంటాడా ?

రాంగోపాల్ వర్మ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు వర్మ. అటు రాజకీయాలు ఇటు సినిమాలకు సంబంధించి అనవసర విషయాలలో కూడా వేలు పెట్టి మరి కెలుకుతూ ఉంటాడు. అయితే ఆర్జీవీ పుట్టినరోజు సందర్భంగా మెగాబ్రదర్ నాగబాబు పోస్ట్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం గా మారింది.

మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో, మనసులో ఏదైతే ఉందో నిర్మొహమాటంగా అదే బయటపెడతారు. ఎలాంటి పట్టింపులు ఉండవు. మీ అభిప్రాయాలు, దృక్పథం సమాజానికి చాలా అవసరం.. కానీ ఇది మీ అహంకారం, మూర్ఖత్వం అని ప్రజలు అనుకోవచ్చు. మీరు మాట్లాడేవన్నీ ఆమోదించదగినవే అయినా ఈ సమాజం నిజాన్ని అంగీకరించడానికి భయపడుతోంది. మీ పద్ధతులు, జీవన విధానం ప్రతి ఒక్కరినీ బాధపెడుతుందని అందరూ అనుకోవచ్చు..

కానీ మీరలా ఉండటం చూసి అంతా అసూయ పడుతున్నారు.అద్భుతమైన సత్యం …. మిమ్మల్ని నిమగ్నం చేసేవి, మీరనుకున్నంతగా కిక్కిచ్చేవి ఈ ప్రపంచంలో ఇంకేమీ లేవు. మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ బోరింగ్ ప్రపంచంలో మీరు కోరుకునేది దొరికేంత వరకూ మీ జర్నీ కొనసాగుతుందని, ఆ కిక్ మీకు దొరుకుతుందని నమ్ముతూ.. నాకు తెలుసు ఈ బర్త్ డే విషెస్ మీకు నచ్చవని. అందుకే దాన్ని విస్మరించి మీకు నచ్చినట్టు మీరు జీవించండి అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు. ఇక వర్మ దీనిపై ఎలాంటి రిప్లయ్ ఇస్తాడో చూడాలి.

https://m.facebook.com/story.php?story_fbid=1572734892917338&id=279714298886077

Advertisement

తాజా వార్తలు

Advertisement