Friday, March 29, 2024

బాలయ్య వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్ @వార్ స్టార్ట్

మా అసోసియేషన్ ఎన్నికల రచ్చ రోజు రోజుకీ ముదురుతోంది. ఈసారి పోటీకి మొత్తం ఐదుగురు సిద్దమౌతుండగా మొదటిసారి మా అసోసియేషన్ ఎన్నికలపై నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ… ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా భవనం కోసం ఒక ఎకరం భూమి కూడా తెచ్చుకో లేరా అంటూ ప్రశ్నించారు. ఇక ఇదే విషయం పై బాలకృష్ణ వ్యాఖ్యలకు మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్ ఇచ్చారు. ఏకగ్రీవ ఎన్నికలు అనేది మంచి విషయం కాదు. ఏ అసోసియేషన్ అయినా ఎన్నికలు ఉండాలి. పోటీదారుల మధ్య ఎల్లప్పుడు ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి.

మా ప్రెసిడెంట్ గా మురళీమోహన్ మా భవనం కోసం పోరాడి ఉంటే చాలా కాలం క్రితమే భవనం ఏర్పాటు అయ్యేది. కానీ ముందు వాళ్లంతా ఈ విషయం నిర్లక్ష్యం చేశారు. కానీ ఇప్పుడు దానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. శివాజీ రాజా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు దానికోసమే ఫండ్ రైగింగ్ కూడా జరిగింది. నరేష్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అది జరగలేదు. ఇక ప్రకాశ్ రాజ్ కు సపోర్ట్ చేసే విషయంలో ఆయనకు అన్ని విషయాలపై క్లారిటీ ఉంది కాబట్టి మద్దతు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు నాగబాబు.

Advertisement

తాజా వార్తలు

Advertisement