Friday, April 19, 2024

బ్రహ్మాజీని సపోర్ట్ చేయాలి అంటూ ట్వీట్ చేసిన నాగ శౌర్య

సీనియర్ నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఫన్నీ ఫన్నీ ట్వీట్స్ చేస్తూ ఉంటారు. అయితే బ్రహ్మాజీ నా తమ్ముడు అంటూ సోషల్ మీడియాలో యంగ్ హీరో నాగ శౌర్య తాజాగా ఓ ఫోటోని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. అసలు విషయం ఏంటంటే అనీష్ కృష్ణ దర్శకత్వం లో బ్రహ్మాజీ నాగ శౌర్య ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పట్టాలెక్కింది.

ఈ సినిమా షూటింగ్ లో బ్రహ్మాజీ నాగశౌర్య పాల్గొన్నారు. అందుకు సంబంధించి ఓ ఫోటో ని పోస్ట్ చేశారు నాగ శౌర్య ఇందులో ఇద్దరు నిలువ బొట్టు పెట్టుకొని పంచె కట్టుకుని నామాలు ధరించి కనిపించారు. నా తమ్ముడు కొత్త వచ్చాడు… మీ అందరి సపోర్ట్ కావాలి. ప్లీజ్ సపోర్ట్ అంటూ ట్వీట్ చేశాడు నాగశౌర్య.

Advertisement

తాజా వార్తలు

Advertisement