Monday, November 11, 2024

నాగ చైతన్య, సమంతల కల మొత్తానికి నెరవేరింది!!

అక్కినేని హీరో నాగచైతన్య, సమంత లకు ఇష్టమైన ప్రదేశం గోవా.వీరి పెళ్లి కూడా అక్కడే జరిగింది. కాగా సమయం దొరికినప్పుడల్లా కూడా ఈ జంట అక్కడికి వెళ్లి హాలిడే ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే కొంతకాలం నుంచి నాగచైతన్య, సమంత ఇద్దరూ కూడా గోవాలో విలాసవంతమైన బీచ్ హౌస్ కోసం వెతుకుతున్నారట.

తాజాగా వీరుకలగన్న డ్రీం ప్లేస్ దొరికిందట. ఒక ఫాం హౌస్ నిర్మాణాన్ని కూడా ప్రారంభించినట్లు సమాచారం. వచ్చే ఏడాదికి ఇది సిద్ధం అవ్వనుందట. ఇక సినిమాల విషయానికి వస్తే నాగచైతన్య లవ్ స్టోరీ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అలాగే థాంక్యూ చిత్రం షూటింగ్ దశలో ఉంది. దీంతో పాటు బాలీవుడ్ సినిమా లాల్ సింగ్ చద్దా లో కూడా నటిస్తున్నాడు నాగచైతన్య. మరోవైపు సమంత కూడా ఓ వైపు సినిమాలు, మరో వైపు వెబ్ సిరీస్ లతో బిజీబిజీగా గడుపుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement