Thursday, October 10, 2024

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన‌ నాగ చైతన్య

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ఉద్దేశిస్తూ… నాగ చైతన్య, సమంతలపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నటుడు అక్కినేని నాగ చైతన్య స్పందించారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ మేరకు సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ చేశారు.

“జీవితంలో విడాకుల నిర్ణయమనేది అత్యంత బాధాకరమైన విషయం. పరస్పర అంగీకారంతోనే నా మాజీ భార్యతో విడిపోయా. మా విడాకులపై గతంలో అనేక నిరాధారమైన ఆరోపణలు వచ్చాయి. మా కుటుంబంపై ఉన్న గౌరవంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమే కాకుండా హాస్యాస్పదం. ఆమె వ్యాఖ్యలు ఆమోదనీయం కాదు. సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవిత నిర్ణయాలను మీడియా హెడ్‌లైన్స్ కోసం ఉపయోగించుకోవడం సిగ్గుచేటు.” అని నాగచైతన్య పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement