Thursday, March 28, 2024

‘చై’ డిజిటల్ ఎంట్రీ ?

కరోనా మహమ్మారి అడుగుపెట్టిన తర్వాత డిజిటల్ రంగానికి డిమాండ్ పెరిగింది. వెబ్ సిరీస్ లో, వెబ్ మూవీస్ లో నటించడానికి స్టార్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్స్ ఓటిటి లో ప్రసారమయ్యే వెబ్ సిరీస్ లకు, మూవీస్ కు వైవిధ్యమైన కథలకు ఆకర్షితులవుతున్నారు. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అక్కినేని నాగచైతన్య కూడా త్వరలో డిజిటల్ అరంగేట్రం చేయబోతున్నారట. ఇప్పటికే ఆయన భార్య సమంత ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 లో నటించింది. ఈ వెబ్ సిరీస్ గురించి ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పుడు నాగచైతన్య కూడా డిజిటల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

అమెజాన్ ప్రైమ్ తో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారని కూడా సమాచారం అందుతోంది. అయితే చైతన్య హిందీ వెబ్ సిరీస్ లో నటించబోతున్నారా లేక తెలుగు వెబ్ సిరీస్ లో నటించబోతున్నాడా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక నాగార్జున కూడా ఓటి కంటెంట్ పై ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. అయితే నాగార్జున కంటే ముందే చై డిజిటల్ ఎంట్రీ ఉండబోతున్న ట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement