Friday, April 26, 2024

వెబ్ సిరీస్ తో రాబోతున్న నాగ్ ?

టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున వెబ్ సిరీస్ చేయబోతున్నారా అంటే అవుననే టాక్ నడుస్తోంది ఫిలింనగర్ లో. ఇక ఇటీవల కాలంలో నాగార్జున సరైన హిట్ కొట్టి చాలా ఏళ్లు అవుతోంది. ఆఖరిగా నాగార్జున హీరోగా నటించిన వైల్డ్ డాగ్ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఇక డిజిటల్ లో మాత్రం మంచి సక్సెస్ సాధించింది.

అయితే ఇప్పుడు నాగార్జున ఓ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నారట. స్వయంగా ఆయనే నిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నారట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయిందని.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుంది అని తెలుస్తోంది. ఇక నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement