Friday, April 19, 2024

నదియా ఫస్ట్ లుక్ @ రామ్ 19

తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సోమవారం ప్రారంభమైంది.అయితే ఫస్ట్ షెడ్యూల్ లో రామ్ పోతినేని తో పాటు సీనియర్ నటి నదియా పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

తాజాగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అయితే ఈ లుక్ లో చీరకట్టుతో కళ్ళద్దాలు పెట్టుకుని ఒక సామాన్య స్త్రీగా కనిపిస్తోంది నదియా. ఈ సినిమాలో నదియా కీలక పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. కాగా ఆమె రోల్ పై చిత్రయూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ సినిమాలో రామ్ సరసన ఉప్పెన సినిమా హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement