Friday, November 15, 2024

My Name is Shruthi | ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

హన్సిక మోత్వానీ తాజాగా న‌టించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మై నేమ్ ఈజ్ శృతి’. శ్రీ‌నివాస్ ఓంకార్ ఈ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ మూవీ న‌వంబ‌ర్ 17న విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా నిలిచింది. కాగా, తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ని లాక్ చేసుకుంది.

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ నెల 17 నుంచి స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. కాగా దీనిపై మేక‌ర్స్ అధికారిక ప్ర‌క‌ట‌న ఇవ్వాల్సి ఉంది. క్రైమ్ థ్రిల‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన‌ ఈ మూవీలో మురళీశర్మ, జయప్రకాష్‌, సాయితేజ, పూజారామచంద్రన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. వైష్ణ‌వి ఆర్ట్స్ ప‌తాకంపై బురుగు రమ్య ప్రభాకర్ ఈ సినిమాను నిర్మించింది. సంగీతం: మార్క్‌ కె రాబిన్‌, సినిమాటోగ్రఫీ: కిశోర్ బోయిడపు.

Advertisement

తాజా వార్తలు

Advertisement