Friday, April 19, 2024

18 ఏళ్ల తరువాత నా తండ్రి పుట్టాడు….తమిళ స్టార్ హీరో ఎమోషనల్

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ మరోసారి తండ్రి అయ్యాడు. సోమవారం శివకార్తికేయన్ కు పండంటి మగబిడ్డ పుట్టాడు. ఇక 2013లో ఆయనకు ఓ కుమార్తె పుట్టింది. ఆమె పేరు ఆరాధన. అయితే తనకు కొడుకు పుట్టాడని తెలియజేస్తూ శివ కార్తికేయన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

మరణించిన తన తండ్రిని ఇప్పుడు తన కొడుకు లో చూడగలనని చెప్పుకొచ్చారు. 18 సంవత్సరాల తర్వాత తన తండ్రి మళ్లీ పుట్టాడు అంటూ ఎమోషనల్ అయ్యారు శివ కార్తికేయన్. నా కళ్ళల్లో నీళ్ళతో ఆమెకు కృతజ్ఞతలు. బేబీ, తల్లి ఇద్దరూ బాగానే ఉన్నారు అని చెబుతూ…కొడుకు తన చేతి వేలిని పట్టుకున్న ఫోటోను షేర్ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement