Wednesday, April 24, 2024

నా బేబీ బాయ్ పెద్దగా అవుతున్నాడు….నిహారిక పోస్ట్ వైరల్

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నిహారిక నిత్యం ఏదో ఒక ఫోటోను, వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాకు ఏం తోచనప్పుడు చేతిలో చేయి వేసుకుని పడుకుంటాము అని చెప్పిన నిహారిక నా బేబీ బాయ్ పెద్దగా అవుతున్నాడు అంటూ తెలిపింది.

తన డాగ్ ఫోటోని షేర్ చేసి ఈ విషయాన్ని చెప్పింది. గతంలో నిహారిక బర్త్ డే సందర్భంగా తన భర్త చైతన్య మొదటి బర్త్ డే గిఫ్ట్ స్పెషల్ గిఫ్ట్ గా ఓ పెట్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. అప్పటి నుంచి దాన్ని తమ సంతానం గా తన కొడుకుగా నిహారిక భావిస్తోంది. అంతే కాకుండా దానికి బజ్ అనే పేరు కూడా పెట్టింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement