Thursday, March 28, 2024

ఎంగేజ్మెంట్ చేసుకున్న ముక్కు అవినాష్..అమ్మాయి ఎవరంటే..?

జబర్దస్త్ షో కామెడీ ఫేమ్ ముక్కు అవినాష్ సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. తాజాగా అవినాష్ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జబర్దస్త్ కామెడీ షో నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించిన ముక్కు అవినాష్ చాలా రోజులు ఆ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను నవ్వించాడు. అనంతరం జబర్దస్త్ ను వదిలి “బిగ్ బాస్” హౌస్ లోకి అడుగు పెట్టాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉండగానే యాంకర్ అరియానాతో స్నేహం, లవ్ అంటూ వార్తల్లో నిలిచాడు.

అప్పటి నుంచి అవినాష్, అరియనా మధ్య ఏదో ఉందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ నుంచి వాళ్లిద్దరూ బయటకు వచ్చాక ఎదురైన మొదటి ప్రశ్న అదే. అయితే ఆ ఇద్దరూ తమ మధ్య మంచి స్నేహం మాత్రమే ఉందని స్పష్టం చేశారు. కానీ నెటిజన్లు వదిలితేగా… స్నేహం మాత్రమే ఉంటే అంత క్లోజ్ గా ఎందుకు ఉంటారు ? అంటూ రూమర్స్ స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు. ఆ రూమర్లతోనే మరింత క్రేజ్ ను సంపాదించుకునే పనిలో పడ్డారు అరియనా, అవినాష్.

https://youtube.com/watch?v=fdO_xB27B4A
Advertisement

తాజా వార్తలు

Advertisement