Monday, September 30, 2024

Mr Perfect రీ-రిలీజ్ డేట్ ఫిక్స్ !

ప్రభాస్ కెరీర్ లో మంచి హిట్ గా నిలిచిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రాన్ని ప్రభాస్ పుట్టినరోజు కానుకగా రీ-రిలీజ్ చేయనున్నట్టు ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడించింది. ఈ సినిమాతో మరోసారి వింటేజ్ డార్లింగ్ ప్రభాస్‌ని చూస్తామని మేకర్స్ తెలిపారు. అక్టోబర్ 22న సినిమాను రీ-రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

రొమాంటిక్ డ్రామాగా 2011లో విడుదలైన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, తాప్సీ పన్ను హీరోయిన్లుగా న‌టించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు సెన్సేషనల్ హిట్ అయ్యాయి. మరి ఈ సినిమా రీరిలీజ్‌తో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement