Monday, April 15, 2024

ఈ వీకెండ్ తగ్గేదే లే ! థియేటర్, ఓటీటీలో రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు

ఈ వారం భారీ సంఖ్యలో సినిమాలు, వెబ్‌సీరీస్‌లు రిలీజ్ అవుతున్నాయి. వేసవి సెలవులు వస్తుండటంతో బిగ్ బడ్జెట్ సినిమాకంటే ముందు చిన్న సినిమాలే థియేటర్లలో బారులు తీరుతున్నాయి. థియేటర్‌లు & ఓటీటీలలో సందడి చేసేందుకు వెబ్ సిరీస్‌లు సిద్దంగా ఉన్నాయి. మరి ఈ వారం విడుదలవుతున్న సినిమాలు/వెబ్ సిరీస్‌ల ఎంటో చూద్దాం..

‘CSI సనాతన్’
ఆది సాయి కుమార్, మిషా నారంగ్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం CSI సనాతన్. ఇన్వెస్టిగేషన్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 10న విడుదలకు సిద్ధంగా ఉంది.ఎప్పటి నుంచో హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది ఈ సినిమాతో సక్సెస్ ఫుల్ పర్ఫార్మెన్స్ అందిస్తాడని అందరూ ఆశిస్తున్నారు.

- Advertisement -

‘టాక్సీ’
హరిష్ సజ్జ దర్శకత్వంలో హరిత సజ్జ నిర్మించారు, వసంత్ సమీర్ పిన్నం రాజు, అల్మాస్ మోతివాలా, సూర్య శ్రీనివాస్, మరియు సౌమ్య మీనన్ కీలక పాత్రల్లో నటించిన మూవీ టాక్సీ. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 10న విడుదల కానుంది.

‘నేదె విదుదల’
రామ్‌రెడ్డి పన్నాల దర్శకత్వంలో ఆసిఫ్‌ఖాన్‌, మౌర్యాని జంటగా చిత్ర పరిశ్రమకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘నేదే విడుదల’ మార్చి 10న విడుదలవుతోంది. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ పేర్కొన్నారు.

‘వాడు ఎవడు’
వాడు ఎవడు వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్, ఇందులో కార్తికేయ, అఖిల్ నాయర్ నటించారు. శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 10న విడుదలకు సిద్ధంగా ఉంది.

‘65’
ఆడమ్ డ్రైవర్, అరియానా గ్రీన్‌బ్లాట్ & క్లో కోల్‌మన్ ఈ అడ్వెంచరెస్ హాలీవుడ్ మూవీ 65లో ప్రధాన నటులు. స్కాట్ బెక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 10న విడుదల కానుంది. తెలియని గ్రహానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తుల కథతో ఈ చిత్రం తెరకెక్కింది.

‘యాంగర్ టేల్స్’
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాంగర్ టేల్స్ అనే మరో వెబ్ సిరీస్‌ను విడుదల చేస్తోంది. ఇందులో దర్శకుడు వెంకటేష్ మహా, సుహాస్, బిందు మాధవి, మడోన్నా సెబాస్టియన్ వంటి స్టార్ నటులు నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ఈ రోజు నుంచి (మార్చి 9) ప్రసారం కానుంది.

‘రానా నాయుడు’
బాలీవుడ్ & టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ వెబ్ సిరీస్‌లో వెంకటేష్, రానా తండ్రీకొడుకులుగా నటిస్తున్నారు. ఈ సిరీస్‌కి సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే విడుదలై విశేష ఆదరణ పొందింది. వెంకటేష్, రానా ఇద్దరికీ ఇది మొదటి వెబ్ సిరీస్, ఇది మార్చి 10న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉంది.

OTT విడుదలలు

Prime video :

హ్యాపీ ఫ్యామిలీ : కండీషన్స్ అప్లై (సిరీస్, హిందీ) – మార్చ్ 10

Netflix :

రేఖ (మూవీ, మలయాళం) – మార్చ్ 10

ది గ్లోరీ (సిరీస్, కొరియన్) – మార్చ్ 10

Disney+hotsar :

చాంగ్ కెన్ డ్రంక్ (మూవీ, ఇంగ్లీష్) – మార్చ్ 10

రన్ బేబీ రన్ (మూవీ, తమిళం/తెలుగు) – మార్చ్ 10

zee5 :

రామ్ యో (మూవీ, కన్నడ) – మార్చ్ 10

బొమ్మై నాయగి (మూవీ, తమిళం) – మార్చ్ 10

బౌడీ క్యాంటీన్ (మూవీ, బంగ్లా) – మార్చ్ 10

Sony liv :

యాక్సిడెంట్ ఫార్మర్ అండ్ కో. (సిరీస్, తమిళం) – మార్చ్ 10

క్రిస్టి (మూవీ, మలయాళం) – మార్చ్ 10

బాడ్ ట్రిప్ (మూవీ, తెలుగు) – మార్చ్ 10

Advertisement

తాజా వార్తలు

Advertisement