Sunday, May 9, 2021

కరోనాతో అభిమాని మృతి…జగపతిబాబు ఎమోషనల్

కరోనా సెకండ్ వేవ్ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎంతోమంది ఆక్సిజన్ అందక ప్రాణాలను విడుస్తున్నారు. కాగా సినీ నటుడు జగపతిబాబు అభిమాన సంఘం గుంటూరు ప్రెసిడెంట్ శ్రీను ఈ మహమ్మారి కారణంగా మృతి చెందారు. ఇదే విషయమై జగపతిబాబు మాట్లాడుతూ… ఎమోషనల్ అయ్యారు. శ్రీను కరోనా తో కన్నుమూయడం బాధాకరమని శ్రీను సంతానంలో ఒకరికి జగపతి అని తన పేరు పెట్టారని ఉద్వేగానికి లోనయ్యారు. ఈ కుటుంబానికి తన అండ ఎప్పటికీ ఉంటుందని భరోసా ఇచ్చారు.

కరోనా వల్ల కళ్ళముందే ఎంతోమంది చనిపోతున్నారని ఎవరు ఎప్పుడు మరణిస్తారో తెలియని స్థితిలో ఉన్నామని అన్నారు జగపతిబాబు. ఇప్పటికైనా అందరూ మాస్కులు ధరిస్తూ, శానిటైజ్ చేసుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News