Friday, November 8, 2024

Cinema:అందరికీ సూపర్ హీరో నాన్నే…

-తండ్రిని అమితంగా ప్రేమించే పాత్రలో కనిపిస్తా..

  • ఫాదర్ – సన్ ట్రియాంగిల్ లవ్ స్టోరి ఇది
  • రిటైర్ అయ్యాక విశాఖ వచ్చేస్తాను
  • హీరో సుధీర్ బాబు
  • విశాఖ పట్నం:

సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మా నాన్న సూపర్ హీరో’ తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సీ ఏ ఎం ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి వీ సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మించారు. ఆర్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి చంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషించారు. చిత్ర బృందం బుధవారం విశాఖలో సందడి చేసింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఎం వి పీ కాలనీ గాది రాజు ప్యాలస్ లో నిర్వహించిన మీడియా సమావే షంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది అన్నారు. మా నాన్న సూపర్ హీరో అక్టోబర్ 11న గ్రాండ్ గా విడుదల కానుంది అని తెలిపారు.


ఫాదర్- సన్ ఎమోషన్ యూనివర్సల్, ఈ సినిమాలో ఆ ఎమోషన్ చూపించడానికి
మా నాన్న సూపర్ హీరో కాన్ఫ్లిక్ట్ పాయింట్ బాగా సెట్ అయింది. ఇద్దరు తండ్రులు, ఒక కొడుకు చుట్టూ తిరిగే కథ ఇది. తండ్రిని చూసుకోవడానికి కొడుకు పడే తపన లో చాలా కొత్త సిచువేషన్స్ ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ అయ్యాయి. ఫాదర్ సన్ ఎమోషన్ ఆల్రెడీ ఉంది. అది జనాలకి గుర్తు చేస్తే చాలు. నాన్నని ప్రేమిస్తున్న కథ చెబుతున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్స్, కాన్ఫ్లిక్ట్ ఫస్ట్ లోనే ఎస్టాబ్లిష్ అవుతాయి. దీన్ని ఇద్దరు ఫాదర్స్, ఒక కొడుకు మధ్య నడిచే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. ఇది యూనివర్సల్ పాయింట్. తప్పకుండా అందరికీ కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను అన్నారు.
ఇది థ్రిల్లర్ కాదు. తొలి రెండు సీన్స్ లోనే కథ ఏమిటనేది ఆడియన్స్ కి క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఆ సిచువేషన్స్ ఎప్పుడు వస్తాయి, అవి వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. హ్యూమన్ రిలేషన్స్ మీద ఉన్న పాయింట్ ఇది. ఇది ఎలాంటి సినిమా, ఆడియన్స్ సినిమా నుంచి ఏమి ఆశించవచ్చు అనేది క్లారిటీగా చెప్పడానికి ట్రై చేశాం.


ఇందులో రియల్ లైఫ్ ని గుర్తు తెచ్చిన మూమెంట్స్ ఏమిటి ?
ఇందులో దాదాపు అన్ని సీన్స్ నన్ను ఇమోట్ చేశాయి. ఇందులో హీరో తండ్రిని విపరీతంగా ప్రేమిస్తాడు. ఈ ఎమోషన్ నేచురల్ గా నా నుంచి వచ్చింది. మన అందరికీ సూపర్ హీరో నాన్నే. ఇందులో ఓవర్ ది బోర్డ్ పెర్ఫార్మెన్స్ లు చేయకూడదని అనుకున్నాం. కెమరా మూమెంట్స్ కూడా చాలా సహజంగా వుంటాయి. నేచురల్ గా చేయడానికి ప్రయత్నించాం. మీరు గమనిస్తే.. గత పెర్ఫార్మెన్స్ లకి, ఈ సినిమాకి ఎక్కడా రిఫరెన్స్ పాయింట్ వుండదు. ఎలాంటి సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా చేసిన సినిమా అన్నారు. విశాఖ, విజయ వాడ, హైదరా బాదు నగారా లలో ప్రీమియర్ షోలు వేస్తున్నాం. ఫ్యాన్స్ నవ దళపతి అని పిలవడం సంతోషంగా ఉందన్నారు. తాను రిటైర్ అయ్యాక విశాఖ లోనే స్థిర పడతాను. విశాఖ బీచ్ అంటె ఎంతో ఇష్టం అని గుర్తు చేశారు. అనంతరం ఆయన అభిమానులతో ఫ్యాన్స్ మీట్ లో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement