Saturday, April 20, 2024

మూవీ క్లాష్‌.. నాలుగు సినిమాలు ఒక్కే రోజు..

ట్రెండ్ మారింది.. సినిమా స‌క్సెస్‌ అవ్వాలంటే కంటెంట్ ఒక‌టి ఉంటే మాత్ర‌మే స‌రిపోదు.. థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌డానికి స‌రైన టైమింగ్ కూడా కావాలి. లేదంటే రిజ‌ల్ట్ డిజాస్టర్ రూపంలో ప‌లుక‌రిస్తుంది. కొంత కాలంగా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చాఫ్ట‌ర్ 2, ఆచార్య లాంటి పెద్ద సినిమాలుండ‌టంతో చిన్న సినిమాలకు బ్రేక్ ప‌డ్డ‌ది. అయితే ఇప్పుడు ఒక్కే రోజు నాలుగు సినిమాలు రిలీజ్ అవ్వ‌బొతున్నాయి.. విశ్వ‌క్ సేన్ న‌టించిన అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణం, శ్రీవిష్ణు, కేథ‌రిన్ న‌టించిన భ‌ళా తంద‌నాన, యాంక‌ర్ సుమ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన జ‌య‌మ్మ పంచాయ‌తీ ప్రేక్ష‌కుల ముందుకు మే 6న రాబోతున్నాయి. ఇప్ప‌టికే విశ్వ‌క్ సేన్‌, శ్రీవిష్ణు, సుమ త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు.

అయితే వీటితో పాటు మార్వెల్ స్టూడియోస్ నుంచి వ‌స్తున్న డాక్ట‌ర్ స్ట్రేంజ్ కూడా అదే రోజు విడుద‌ల కాబొతుంది.. ఈ సినిమాకు మెట్రో సిటీస్‌లో అడ్వాన్స్ బుకింగ్ భారీగానే అవుతున్నాయ‌ట‌. ఒక‌వేళ ఈ చిత్రం పాజిటివ్ టాక్ వ‌స్తే మాత్రం.. త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌తో క‌లిసి రొటీన్ తెలుగు సినిమాల‌ను ప‌క్క‌న పడేసి.. మార్వెల్ ప్రాజెక్టును థియేట‌ర్ల‌కు ప‌రుగులు పెట్ట‌డం ఖాయ‌మ‌ని ప‌లువురు సినీ విశ్లేషకులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇదే నిజ‌మైతే బాక్సాపీస్ వద్ద ఈ మూడు సినిమాల ప‌రిస్థితి ఎలా ఉండ‌బోతుంద‌న్న‌ది మాత్రం ప్ర‌శ్నార్థ‌క‌మే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement