Monday, March 25, 2024

స్వర్గంలో నాగార్జున తో మోనల్ ?

బిగ్ బాస్ సీజన్ 4తో ప్రేక్షకుల మన్ననలు పొందింది మోనల్ గజ్జర్. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాక ఈ అమ్మడికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే బిజీ బిజీగా గడుపుతున్న మోనల్ కు ఇప్పుడు మరో అవకాశం వచ్చింది. అక్కినేని నాగార్జున కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయన. ఈ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా తెరకెక్కబోతోంది.

త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. అయితే ఈ సినిమాలో మోనల్… కీలక పాత్ర పోషించబోతుందట. బంగార్రాజు సినిమా లో సుదీర్ఘమైన స్వర్గం ఎపిసోడ్ ఉంటుందట. ఆ ఎపిసోడ్ లో మోనాల్ రంభగా కనిపించనుందని సమాచారం. అంతే కాకుండా నాగార్జున కు మోనాల్ కు మధ్య అదిరిపోయే సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. మరి రంభగా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement