Tuesday, March 26, 2024

థ్యాంక్యూ టీజర్​ రిలీజ్​కు ముహూర్తం ఫిక్స్.. ​మాస్​ లుక్​లో కనిపిస్తున్న నాగచైతన్య

ఈ ఏడాది ‘బంగార్రాజు’ సినిమాతో హిట్ కొట్టిన నాగచైతన్య, మరో సినిమాతో పలకరించడానికి రెడీ అవుతున్నాడు. విభిన్నమైన కథా, కథనాలతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న టాలివుడ్ స్టార్ అక్కినేని నాగచైతన్య హీరోగా రూపొందుతున్న సినిమా ‘థ్యాంక్యూ’. స్టైలీష్ లుక్ తో నాగచైతన్య కనిపిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా కథానాయికగా అలరించనుంది.

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్క‌తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తుండ‌గా థమన్ సంగీతాన్ని సమకూర్చాడు. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు మేక‌ర‌స్స్. ఈ నెల 25వ తేదీన సాయంత్రం 5:04 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసింది సినీ బృందం. కాగా. జులై 8వ తేదీన ఈ సినిమాను థియేట‌ర్ల‌లో విడుదల చేయనున్నారు.

https://twitter.com/RaashiiKhanna_/status/1528700992870809602

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement