Friday, April 19, 2024

చరణ్ కొత్త పాన్ ఇండియా సినిమా షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ప్రస్తుతం ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. దీని తరువాత శంకర్ దర్శకత్వంలో కూడా రామ్ చరణ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

అయితే అధికారికంగా ఈ సినిమా షూటింగ్ డేట్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే సెప్టెంబర్ 8 న పూజా కార్యక్రమాన్ని నిర్వహించి… ఆ రోజు నుంచే రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement