Friday, March 29, 2024

బంగార్రాజు కి అంతాసెట్ !!

సీనియర్ హీరో అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ప్రేక్షకులముందుకు వచ్చిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయన. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పాటు కలెక్షన్లు కూడా బాగా రాబట్టింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమాను తెరకెక్కించబోతున్నారు కళ్యాణ్ కృష్ణ. ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటించబోతున్నారు.
మనం తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ఇదే.

ఇక ఈ సినిమాలో నాగచైతన్య కు జోడిగా ఉప్పెన సినిమా హీరోయిన్ కృతి శెట్టి నటించబోతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం..ఈ నెల 20 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ షూట్ కోసం ఒక ప్రత్యేకమైన సెట్ ను కూడా వేశారట. ఈ షెడ్యూల్ లో నాగార్జున, రమ్యకృష్ణ పై సీన్స్ తెరకెక్కించనున్నారట. మరి ఈ సినిమాతో నాగార్జున ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement