Thursday, March 28, 2024

‘అఖండ’ ఫస్ట్ సింగల్ కు ముహూర్తం ఫిక్స్ ?

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ ,పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.

ఇదిలా ఉండగా అఖండ సినిమా నుంచి ఓ అప్డేట్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ఒక డేట్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆ అప్డేట్ మరేదో కాదట. అఖండ సినిమా ఫస్ట్ సింగిల్. మే 28న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బ్యాక్ గ్రౌండ్ తో అదరగొట్టాడు థమన్. దీనితో ఆల్బమ్ పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement