Wednesday, April 24, 2024

కొత్త సినిమా అనౌన్స్ పై మోక్షజ్ఞ ట్వీట్

మే 28 నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఓ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు నిర్మాణ సంస్థ NBK ఫిలిమ్స్ అధికారికంగా ఓ ట్వీట్ చేసింది. రేపు ఉదయం 8 గంటల 45 నిమిషాలకు సర్ ప్రైజ్ వుంది.. చూస్తూనే ఉండండి అంటూ ట్వీట్ చేసింది. అయితే అప్పటి నుంచి కూడా అభిమానులు ఆ సర్ ప్రైజ్ ఏంటి అనే చర్చలు మొదలు పెట్టారు. బాలకృష్ణ కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఉంటుందా లేక ఇంకేమైనా ఉంటుందా అని చర్చించుకున్నారు.

అయితే ఫ్యాన్స్ ఎలా చర్చించుకుంటున్నారు లేదో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ట్వీట్ పెట్టాడు. ఆ ట్వీట్ తో కొత్త సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుందనే క్లారిటీ ఇచ్చేశాడు. డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలకృష్ణ పేర్లను ట్యాగ్ చేస్తూ #NBK107, #NBK108 అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement