Friday, April 19, 2024

కత్తెర పట్టిన రోజమ్మ… చేయించుకున్నోడి పరిస్థితి ఏంటో ?

సీనియర్ నటి వైఎస్ ఆర్ సిపి ఎమ్మెల్యే ఎమ్మెల్యే రోజా హైదరాబాద్ లో సందడి చేశారు. బ్యూటీ సెలూన్ ప్రారంభోత్సవానికి హాజరైన రోజా కత్తెర పట్టుకొని హెయిర్ కట్ కూడా చేశారు. రోజా హెయిర్ కట్ చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రోజా తో పాటు కూతురు అన్షు మాలిక, కొడుకు కృష్ణ లోహిత్ కూడా వచ్చాడు. జ్యోతి ప్రజ్వలన చేసి రోజా సెలూన్ ను ప్రారంభించారు.

ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. మీకు హెయిర్ కట్ కూడా తెలుసా మేడం అంటూ పంచులు వేస్తున్నారు. ఆ హెయిర్ కట్ చేయించుకున్న వాడి పరిస్థితి ఏంటో అంటూ వెటకారంగా కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement