Wednesday, April 24, 2024

గని డిజిటల్, శాటిలైట్ రైట్స్ వారికే !!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గని. స్పోర్ట్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ బాక్సర్ గా వరుణ్ తేజ్ కనిపించబోతున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం గని డిజిటల్ శాటిలైట్ రైట్స్ ను పెద్దమొత్తంలో చెల్లించి ఆహా స్ట్రీమింగ్ సంస్థ సొంతం చేసుకుందట.

24 కోట్ల రూపాయలకు గని హక్కులను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సునీల్ శెట్టి, ఉపేంద్ర ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement