Sunday, April 14, 2024

జైలర్ సెట్స్‌లో మిల్కీ బ్యూటీ.. పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌లో తెలుగు నటుడు సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా, మూవీ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ ఈ చిత్ర తారాగణం గురించి లేటెస్ట్ అప్డేట్స్ ను రిలీజ్ చేసింది.

స్టార్ నటి తమన్నా భాటియా జైలర్ సెట్స్‌లో చేరినట్లు ఇవ్వాల మేకర్స్ ప్రకటించారు. దాంతో పాటు ట్రెండీ దుస్తుల్లో మెరిసిపోతున్న తమన్నా పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement