Friday, April 19, 2024

మిల్కీ బ్యూటీ అదిరిపోయే సాంగ్

హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నితిన్. నితిన్ ప్రస్తుతం మాస్ట్రో సినిమా చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బాలీవుడ్ సూపర్ డూపర్ హిట్ సాదించిన అందాధూన్ సినిమాకు రీమేక్ చిత్రంగా తెరకెక్కుతుంది. కాగా ఈ మూవీ షూటింగ్ ఇటీవల పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది.

కాగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న మిల్కీబ్యూటీ తమన్నా ఓ ప్రత్యేకమైన సాంగ్ లో అదిరిపోయే స్టెప్స్ వేసినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుందట. మరి తమన్నా తన డాన్స్ తో ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నభా నటేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement