Wednesday, April 24, 2024

Mem Famous – అంద‌రూ ఎంజాయ్ చేసే చిత్రం – సుమంత్‌ ప్రభాస్‌

‘మేమ్‌ ఫేమస్‌’ చిత్రం ఈ నెల 26న థియేటర్లలో సందడి చేయనుంది. దీనికి సుమంత్‌ ప్రభాస్‌ దర్శకత్వం వహించడంతో పాటు- ప్రధాన పాత్ర పోషించారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి ఇతర ప్రముఖ తారాగణం. అనురాగ్‌ రెడ్డి, శరత్‌, చంద్రు మనోహరన్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిం చారు. ఈ నేపథ్యంలో సుమంత్‌ ప్రభాస్‌ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

ఈ చిత్రానికి కాన్సెప్ట్‌, స్ఫూర్తి గురించి చెప్పండి ?
కాలేజీలో అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఒక షార్ట్‌ ఫిల్మ్‌ తీశాం. అది నచ్చి ఒక ఫిల్మ్‌ స్కూల్‌ వాళ్ళు మాకు కం-టె-ంట్‌ క్రియేట్‌ చేయమని కెమెరాలు స్పాన్సర్‌ చేశారు. పిల్ల పిలగాడు అనే వెబ్‌ సిరీస్‌ చేశాం. ఛాయ్‌ బిస్కెట్‌ అనురాగ్‌, శరత్‌ పిలిచి మా గురించి అడిగారు. మంచి కం-టె-ంట్‌ క్రియేట్‌ చేస్తే కూడా దాన్ని సాధించవచ్చు అని చెప్పారు. మళ్ళీ ఒక వెబ్‌ సిరీస్‌ చేయాలనేది వారి ఆలోచన. సినిమానే చేసేద్దామన్నాను. కథ రాశాను. వారికి నచ్చింది. చాలా క్లారిటీ- గా ఉన్నావు నువ్వే డైరెక్ట్‌ చెయ్‌ అన్నారు.
మొదటి రోజు షూటింగ్‌ ఎలా అనిపిం చింది. ?
మొదటి నుంచి చాలా క్లారిటీ-గా వున్నాం. సినిమాను తొలుత ఆఫీస్‌ లో ఫోన్‌ లో షూట్‌ చేశాను. సెట్స్‌కి వెళ్ళినప్పుడు పూర్తి కాన్ఫిడె న్స్‌గా ఉన్నాం..
మేమ్‌ ఫేమస్‌ -టైటిల్‌ పెట్టడానికి కారణం ?
ఇందులో వున్న కుర్రాళ్ళ ఎనర్జీని తెరపై ట్రాన్స్‌లేట్‌ చేయడానికి ప్రయత్నించారు. వూర్లో ఏం చేసినా ఫోకస్‌, ఫేమస్‌ అవ్వాలనే ఆలోచన వున్న కుర్రాళ్ళ కథ ఇది. దానికి తగ్గట్టు- మేమ్‌ ఫేమస్‌ అని పేరుపెట్టాం.
తెలంగాణలో చాలా మంది సోషల్‌ మీడియా వేదికగా ఫేమస్‌ అయ్యారు కదా.. వాళ్ళ బయోపిక్‌ లా వుంటు-ందా ?
ఇది బయోపిక్‌ కాదు. కానీ ఏం పని చేసినా ఫేమస్‌ అవ్వాలనుకునే ఉద్దేశం వున్న వాళ్ళకి ఇది బయోపిక్‌.
మీ అసలు పేరు సుమంత్‌ ప్రభాస్‌ నా ?
నాన్న నా పేరు సుమంత్‌ రెడ్డి అని పెట్టారు. నేను ప్రభాస్‌ ఫ్యాన్‌ ని. చిన్నప్పుడు మనకి ఇష్టమైన హీరో పేరు పక్కన మన పేరు వుంటే బావుంటు-ందనే ఆలోచన వుండేది. అలా ఫేస్‌ బుక్‌ క్రియేట్‌ చేసినప్పుడు సుమంత్‌ ప్రభాస్‌ అని పెట్టు-కున్నా.

Advertisement

తాజా వార్తలు

Advertisement